Pawan Kalyan‌పై బైరెడ్డి తీవ్ర ఆగ్రహం.. కొండారెడ్డి బురుజు దగ్గర కుస్తీకి రెడీ అంటూ సవాల్

సీమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు....

Update: 2023-01-26 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. విభజన వాదం వినిపిస్తే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తనను ముసలోడు అని పవన్ అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండారెడ్డి బురుజు దగ్గర పవన్‌తో కుస్తీకి రెడీ అని సవాల్ విసిరారు. రాయలసీమ ఉద్యమకారులను పవన్ అవమానించారని బైరెడ్డి మండిపడ్డారు. సీమ సెంటిమెంట్ పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ విడిపోయి, సీమను రెండుగా చేయాలని చూస్తే పవన్ కనీసం నోరెత్తలేదన్నారు. లక్ష మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా సీమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో మూడు రాజధానులు వద్దంటే ప్రత్యక ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం చేస్తున్న బైరెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ధర్మానకు ఉత్తరాంధ్ర కావాలా..?. ముసలోడైన బైరెడ్డికి ప్రత్యేక రాయలసీమ కావాలా..?. అని పవన్ మండిపడ్డారు. విభజన వాదం వినిపిస్తే తోలు తీస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా వేర్పాటు ధోరణితో మాట్లాడితే తన అంతటి తీవ్రవాది ఉండరని హెచ్చరించారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. అటు మంత్రి బొత్స కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కూ కేఏ పాల్‌కు తేడా లేదని ఎద్దేవా చేశారు. ఉగాది కల్లా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్‌కు చెప్పామని తెలిపారు. ఇందుకు సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారని బొత్స పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:     నారా లోకేశ్ 'Yuvagalam' సక్సెస్ ఖాయం... ఎవరూ ఆపలేరు! 

Tags:    

Similar News