Kurnool: ఉపాధి పనులల్లో రాజకీయ జోక్యం తగదు

పేదలకు నాలుగు మేతుకులు పెట్టే ఉపాధి హామీ పనుల్లో రాజకీయ జోక్యం తగదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు అన్నారు..

Update: 2023-06-14 17:31 GMT

దిశ, కర్నూలు అర్బన్: పేదలకు నాలుగు మేతుకులు పెట్టే ఉపాధి హామీ పనుల్లో రాజకీయ జోక్యం తగదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు అన్నారు. బుధవారం కర్నూలు రూరల్ మండలం ఈ-తాండ్రపాడు గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు, సర్పంచ్ భాలపీరతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో రాజకీయ జోక్యం వల్ల రెండేళ్ల నుంచి పనుల్లేక గ్రామంలో వ్యవసాయ కూలీలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఎన్ఐసీ వచ్చిన తరువాత కొత్త కొత్త పద్ధతులను తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా ఎప్పటి నుంచో పనులు చేస్తున్నా వ్యవసాయ కూలీల జ్యాబ్ కార్డుల్లేక పనులకు రానివడం లేదన్నారు. అధికారులు ఈ సమస్యను గుర్తించి వెంటనే అందరి పేర్లు వచ్చే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా బి.పద్మావతి, సీలమ్మ, శాలిబి, టి.లక్ష్మీదేవి, టి.పార్వతమ్మ, నూర్జహాన్, బి.లలితమ్మ, కె.హైమావతి, కె.పద్మ, కె.రాణెమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags:    

Similar News