Kurnool: రూ.3 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన జూనియర్ అసిస్టెంట్
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
దిశ, కర్నూలు ప్రతినిధి: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి మీడియాకు వెల్లడించారు.
ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసేందుకు కర్నూలు ప్రాంతానికి చెందిన మన్సూర్ బాషా మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయానికి అప్లికేషన్ ఫార్వడ్ అయింది. దీంతో రిజిస్ట్రార్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ షేక్ మహబూబ్ బాషా రూ.3 వేలు లంచం డిమాండ్ చేశారు. డబ్బులిచ్చేందుకు ఇష్టం లేని బాధితుడు 14400కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో స్పందించిన ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి సిబ్బందితో దాడులు నిర్వహించి రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.