Ap News: వీర మహిళ గోవిందమ్మకు ప్రత్యేక సత్కారం
వీర మహిళ గోవిందమ్మకు జనసేన పార్టీ ప్రత్యేకం సత్కారించింది..
దిశ, వెబ్ డెస్క్: 2022 అక్టోబర్‌లో విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో విశాఖ తీర ప్రాంతంలో శ్రీమతి నులక గోవిందమ్మ అనే వీర మహిళ గంటల పాటు విశాఖ తీర ప్రాంతంలో నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. అప్పటి ఘటనను గుర్తు పెట్టుకున్న జనసేన పార్టీ తాజాగా గోవిందమ్మను సత్కరించింది. ఈ రోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో గోవిందమ కుటుంబాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా సత్కరించారు. ఆ రోజు గోవిందమ్మ చూపిన తెగువ చాలా మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాగబాబు కొనియాడారు. జనసేన గెలుపునకు 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడానికి పవన్ కల్యాణ్ పట్టుదల, కార్యకర్తల కృషి దోహదపడ్డాయన్నారు. జనసేన విజయం, బలోపేతానికి తాను అండగా ఉంటానని నాగబాబు పేర్కొన్నారు.