అవినాశ్ తప్ప ఆ పార్టీలోకి వైసీపీ ఎంపీలు....!

బీజేపీలో చేరేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు..

Update: 2024-06-21 10:32 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు తప్ప మిగిలి అన్ని చోట్ల కూటమి ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనీసం ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయింది. అధికారంలోకి ఉండగా ఎవరినీ లెక్కచేయని వైసీపీ నేతలు.. ఇష్టానుసారంగా టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పుడు ఘోర ఓటమితో తీవ్రమైన భయం పట్టుకుంది. తమపై ఎప్పుడు ఏ కేసులు నమోదవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అధినేత ధైర్యం చెప్పినా లోపల మాత్రం వణికిపోతున్నారట. దీంతో గోడ దూకేస్తే పోలా అని అనుకుంటున్నారట. ముఖ్యంగా ఎంపీల విషయంలో అదే జరుగుతోందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుంచి అవినాశ్ రెడ్డి, రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి తనూజా రాణి గెలుపొందారు. అయితే వీరిలో అవినాశ్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. కేంద్ర బీజేపీ అగ్రనేతలతో టచ్ ఉన్నారని తెలుస్తోంది.


అయితే ఈ విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. బీజేపీ అధిష్టానంతో ఎంపీ మిథున్ రెడ్డి టచ్‌లో ఉన్నారని తెలిపారు. త్వరలో వైసీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోందని ఆదినారాయణ పేర్కొన్నారు. బీజేపీ ఓకే చెబితే అవినాశ్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కానీ బీజేపీ అగ్ర నాయకులు వాళ్లను వద్దని అంటున్నారని, అయినా సరే మిథున్ రెడ్డి బీజేపీలో చేరాలని లాబీయింగ్ చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.


Similar News