AP High Court:నేడు హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) సమయంలో 2024 మే 11 నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరఫున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-23 06:46 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) సమయంలో 2024 మే 11 నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరఫున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. ఆ సమయంలో శిల్పా రవి కానీ, అల్లు అర్జున్(Allu Arjun) కానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక వీఆర్వో(VRO) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతను అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు(Police complaint) చేశారు.

దీంతో అల్లు అర్జున్‌తో పాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30(Police Act) అమలును ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి సినీ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు(బుధవారం) ఏపీ హైకోర్టు(AP High Court)లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్ విచారణకు రానున్నాయి. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు. ఇక నేడు పిటిషన్ పై విచారణ జరగనుంది.

Tags:    

Similar News