భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే గ్రామాల్లో సదస్సులు

భూ సమస్యలు పరిష్కరించడానికి రీసర్వే జరిగిన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ కామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-10-23 09:26 GMT

దిశ ప్రతినిధి,నంద్యాల సిటీ: భూ సమస్యలు పరిష్కరించడానికి రీసర్వే జరిగిన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ కామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం బొల్లవరం గ్రామంలో రెవెన్యూ సిబ్బందిచే సదస్సు నిర్వహించి రైతుల నుంచి భూ సర్వేలో జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించిన సవరణలు చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 6 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించడం జరిగిందని ఈ నెల 24న గోపవరం 25న మసీదుపురం, 26 నంది పల్లె, 29న తిమ్మాపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ సర్వేలో జరిగిన కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించిన వాటిని సవరించడానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సుబ్బారావు, మండల సర్వేయర్ బాషా, వీఆర్వో మాధవరావు, చలమయ్య, నరసింహులు సర్వేయర్ లతోపాటు మండల టిడిపి అధ్యక్షులు ఉల్లి మధు గ్రామ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు.


Similar News