హైకోర్టులో అవినాష్ కు నిరాశ.. నెక్స్ట్ ఏంటి?

విదేశీపర్యటనకు అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్ రెడ్డికి నిరాశ ఎదురైంది. సీబీఐ కోర్టులో పిటిషన్ వేయాలని కోర్టు సూచించింది.

Update: 2024-10-23 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case)కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి.. తమ ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కండిషన్లను సడలించాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసినపుడు వారిద్దరూ దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. నేడు వారి పిటిషన్ పై విచారణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. అందుకు నిబంధనలను సడలించాలని కోర్టుకు అవినాష్ (Avinash Reddy), భాస్కర్ రెడ్డిల తరఫు లాయర్ విజ్ఞప్తి చేయగా.. ఈ విషయంపై సీబీఐ (CBI)కోర్టును ఆశ్రయించాలని సూచించింది. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని తెలిపింది. దీంతో అవినాష్ కు నిరాశ ఎదురైంది. 


Similar News