మందుబాబులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్..!

రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-23 09:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ(TDP) కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99కే నాణ్యమైన లిక్కర్‌(Quality liquor)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రూ.99 నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు(Liquor Sales) ఇవాళ(బుధవారం) ప్రారంభం అయ్యాయి. మార్కెట్‌లోకి చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న (మంగళవారం) రాత్రికే లిక్కర్ షాపులకు రూ.99 లిక్కర్ చేరుకున్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు.

ఈ క్రమంలో కొత్త మద్యం(New Liquor) అందుబాటులోకి రావడం, వాటి ధరలు తగ్గించడంతో మందుబాబులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలో షార్ట్స్ పేరుతో బ్రాండీ(brandy), విస్కీ(whiskey) అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ ఒక్కో లిక్కర్ షాపుకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో క్వార్టర్ బాటిల్ ధర రూ.200 నుంచి రూ.250 ఉండేదని.. ఈ క్రమంలో సగం సంపాదన వాటికే ఖర్చు అయ్యేదని మందుబాబులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం రూ.99కే లిక్కర్ దొరకడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News