రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం.. ఒకరి మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి.

Update: 2024-10-23 07:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను నాశనం చేసి, గ్రామస్తులపై దాడి పాల్పడ్డాయి. ఏనుగుల దాడిలో పీఎంకే తండాలో రెడ్యానాయక్ దుర్మరణం పాలయ్యాడు. ఏనుగులు రెడ్యానాయక్ ను తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఏనుగులను అక్కడి నుండి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కుంకి ఏనుగుల సహాయం తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. గ్రామాల్లో వరి, అరటి, టమోటా, బీన్స్ , మిర్చి తదితర పంటలను ధ్వంసం చేశాయి.

కొన్ని నెలల క్రితం ఇదే పీఎంకే తండాకు చెందిన రైతు కన్నానాయక్‌ పై ఏనుగుల మంద దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పంట భూముల్లో ఏనుగులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఏనుగులు రైతులపై దాడులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ గొల్లపల్లి, మణీద్రం, సింగసముద్రం గ్రామాల్లో, పల్లి కుప్పం, రాంనాయక్ తండాల్లో తరుచు ఏనుగుల మందల దాడిలో పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సాగుతోంది.


Similar News