జిల్లాలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్‌చల్
బాపట్ల పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్ చేశాడు.

దిశ, బాపట్ల: బాపట్ల పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్ చేశాడు. తాను లేబర్ ఆఫీసర్ అంటూ, సీజింగ్ ఆఫీసర్ నీ అంటూ వ్యాపారస్తులకు పరిచయం చేసుకొని, తమ షాపులు లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాలని లేకపోతే షాపులు సీజ్ చేయాల్సి వస్తుందని పలు విధాలుగా వ్యాపారస్తుల షాపు యజమానులకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించాడు. దీంతో కంగుతిన్న కొందరు వ్యాపారస్తులకు ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. పట్టణంలోని ఓ వాటర్ వాటర్ ప్లాంట్ యజమాని అయితే జరిగే తంతు మొత్తం నిజమేననుకొని నమ్మి గూగుల్ పే ద్వారా నేరుగా 7,500 నగదును కూడా పంపినట్లు సమాచారం.
విషయం ఆ నోటా ఈ నోటా చేరి చివరికి పోలీసుల వరకు చేరడంతో ఆ వ్యక్తి తన ఫోన్ నెంబర్లను వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 9160508093,8074385658 ల నెంబర్ల నుంచి నా పేరు సంజయ్ నాయుడు అని చెప్పి, తాను లేబర్ ఆఫీసర్ నీ అంటూ వ్యాపారస్తులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం విశేషం. ఈ విషయమై బాపట్ల లేబర్ ఆఫీసర్ సాయి లక్ష్మి మాట్లాడుతూ వ్యాపారస్తుల ఏమి అటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఫోన్ చేసినట్లు తన దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.