Ap: 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
తులకు మంత్రి నాదెండ్ల మనోహర్ తీపికబురు అందించారు...

దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తీపి కబురు అందించారు. ధాన్యం అమ్మిన డబ్బులను 24 గంటల్లో వాళ్ల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ(Tenali Janasena Office) కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం(Grain) కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకూ రూ. 8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం(Jagan Govt)లో పంట విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోహర్ గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు వద్ద ధాన్యం కొలుగోళ్లను సులభతరం చేశామని మనోహర్ చెప్పారు.

రైతులకు కూటమి ప్రభుత్వం పెద్ద వేస్తోందని మంత్రి నాదెండ్ల తెలిపారు. రైతు సేవా కేంద్రాల ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి. గన్నీ బ్యాగ్స్, రవాణా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తేమ శాతం 17-20 ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులు ఏఐ ద్వారా ధాన్యం అమ్మకాలు జరుపుకునేలా సేవలను సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల మనోహన్ పేర్కొన్నారు.