ఏపీకి కొత్త డీజీపీ.. కేంద్రానికి ఐదుగురి పేర్లు
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త డీజీపీ రాబోతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు త్వరలో కొత్త డీజీపీ(New DGP) రాబోతున్నారు. ప్రస్తుతం హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) ఇంచార్జి డీజీపీగా సేవలు అందిస్తున్నారు. ఆగస్టు 31తో హరీశ్ కుమార్ గుప్తా పదవీ కాలం ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి డీజీపీని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఇప్పటికే పరిశీలించింది. అయితే వీరిలో హరీశ్ కుమార్ గుప్తా పేరు కూడా ఉంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది. ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు హరీశ్ కుమార్ గుప్తా, రాజేంద్రప్రసాద్ రెడ్డి, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం, మాదిరెడ్డి ప్రతాప్ పేర్ల లిస్టును కేంద్రానికి పంపింది. కేంద్రం పరిశీలించి వీరిలో ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అనంతరం డీజీపీ నియామకంపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈమేరకు రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.