Rajahmundry Airport : రాజమండ్రికి చేరుకున్న తొలి విమాన సర్వీస్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry) ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్(First flight service)ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది.

Update: 2024-12-12 07:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry) ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్(First flight service)ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu), రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి9Daggubati Purandeswari), కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas)లు ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు. రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. విమాన సర్వీస్ ప్రారంభోత్సంలో మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh), ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్ర వరం అనుసంధానమైందని, ఇక్కడి నుంచి భవిష్యత్తులో మరిన్ని విమానాలు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం దేశంలో విమాన యాన సర్వీస్ ల విస్తరణకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఎంపీ పురందేశ్వరీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇక్కడి నుంచి తిరుపతి, షిర్టీ, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీస్ లు నడిపిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తుందన్నారు. 

Tags:    

Similar News