‘వైఎస్ జగన్‌కు స్పెషల్ కోర్టు అంటే తెలుసా?’.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ది(State development)కి నోచుకోలేదని.. వైసీపీ ప్రభుత్వం పై ఏపీ హోంమంత్రి(Home Minister) వంగలపూడి అనిత(Vangalapudi Anita) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-22 11:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ది(State development)కి నోచుకోలేదని.. వైసీపీ ప్రభుత్వం పై ఏపీ హోంమంత్రి(Home Minister) వంగలపూడి అనిత(Vangalapudi Anita) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు(మంగళవారం) హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో రాష్ట్రం నష్టం పోయిందన్నారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ గాడి తప్పయన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలోకి తీసుకువస్తుందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు(YCP Leaders) తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలకే తాము జవాబుదారితనంగా ఉంటామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆమె ఫైరయ్యారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి వందల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన దాడులు(Assaults), లైంగిక దాడులు(sexual assaults), హత్యల(murders)పై జగన్ ఏమి సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు(YS Jagan) స్పెషల్ కోర్టు (Special Court) అంటే తెలుసా? అని హోం మంత్రి(Home Minister) అనిత ప్రశ్నించారు. గతంలో నేరం జరిగితే 6 నెలలు దాటినా నిందితులు దొరికేవారు కాదు.. కానీ ప్రస్తుతం ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. గతంలో మహిళ పై అఘాయిత్యాలు జరిగితే వైఎస్ జగన్ ఎందుకు పరామర్శించలేదని హోం మంత్రి అనిత ప్రశ్నించారు.

 

Tags:    

Similar News