CM Chandrababu:‘ఖండాంతరాలు దాటిన జగన్ అవినీతి’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తాజాగా పబ్లిక్ డొమైన్ లో ఉన్న.. అమెరికాలో వేసిన కేసు పై అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

Update: 2024-11-22 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తాజాగా పబ్లిక్ డొమైన్ లో ఉన్న.. అమెరికాలో వేసిన కేసు పై అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో జరిగిన వ్యక్తం అవినీతిపై చర్యలు చేపడతామని అన్నారు. అదే సమయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈరోజు జగన్ పై వచ్చిన ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ఎవరు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటారని అన్నారు. అమెరికాలో వేసిన కేసు పై అధ్యయనం చేస్తున్నామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బును దోచేశాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో జగన్ ప్యాలెస్ కట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రభుత్వ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్లో నాశనం అయిపోయిందా అన్నారు. నిజ నిజాలు తేల్చాల్సిన బాధ్యత మనపై కూడా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తిని ఒక గంట తిట్టితే సరిపోదు అన్నారు. జగన్ ఎలాగైనా అసెంబ్లీకి పిలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ దోపిడీలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని అన్నారు.


Similar News