Palnadu: దొంగల ముఠా అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం

పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు..

Update: 2024-11-22 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. చోరీ సొత్తును రికవరీ చేశారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ఫిర్యాదులు వెల్తువెత్తాయి. దీంతో ఈ చోరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో నిందితులను గుర్తించారు. వారి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్ చేసి మీడియా ముఖంగా వారి చిట్టా విప్పారు.

పల్నాడు జిల్లాలో 9 మంది ముఠా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈపూర్‌లో ఇళ్లు, షాపు, దారి దోపిడీలు, వాహన చోరీలు చేశారు. దీంతో దొంగతనాలపై పోలీసులు ఫిర్యాదు అందించాయి. ఈ మేరకు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.25 లక్షల విలువ చేసే 18 బైక్స్, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, రూ.10 వేల నగదు, టీవీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరానలు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.


Similar News