Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్.. ప్రధాన కారణం అదే!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ వ్యవహారంపై కోర్టు నోటీసులను తీసుకోకుండా విచారణకు హాజరు కాకపోవడం పట్ల కోర్టు సీరియస్ అయింది. లడ్డూ ప్రసాదం (Laddu Prasadam)లో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యి వాడారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మనేని రామారావు (Immaneni Ramarao) ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే పవన్ (Pavan) బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ (Youtube) నుంచి తొలగించాలని కోర్టును కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను నవంబర్ 22న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కానీ, పవన్ (Pavan) రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.