ఆ సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి

పుష్ప-2(Pushpa-2) సినిమాను చూసివచ్చి.. తాను పడుకున్న ఆర్టీసీ బస్సు(RTC bus)ను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర సంఘటన కాకినాడ జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది.

Update: 2024-12-24 03:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2) సినిమాను చూసివచ్చి.. తాను పడుకున్న ఆర్టీసీ బస్సు(RTC bus)ను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర సంఘటన కాకినాడ జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సాదిక్ అనే యువకుడు ఆదివారం రాత్రి కాకినాడ జిల్లా(Kakinada District) నర్సీపట్నంకి వచ్చి.. అక్కడే ఉన్న ఓ థియేటర్‌లో పుష్ప-2 చూసి బస్టాండ్ కి వెళ్లాడు. అయితే అక్కడ వారి ఊరికి వెళ్లే బస్సులు లేకపోవడంతో.. బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సులో పడుకున్నాడు. అనంతరం మధ్యరాత్రి లేచి బస్సుకు తాళం ఉండటాన్ని చూసిన యుకుడు.. ఆ బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద బస్సును ఆపి అక్కడ పడుకున్నాడు. అయితే రాత్రి సమయంలో బస్సును ఎవరో ఎత్తుకెళ్లారని డిపో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకున్న బస్సును స్వాధీనం చేసుకొని, అందులో పడుకున్న బస్సు దొంగను అరెస్ట్ చేశారు.


Similar News