చేయి చాచి అడుక్కుంటున్న చిన్నారులు.. అధికారులు ఏం చేశారంటే..!
కర్నూలు ప్రధాన కూడళ్లలో అడుక్కుంటున్న చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: డబ్బులు కోసం కొందరు తల్లిదండ్రులు ప్రేమ, అప్యాయతలు మర్చిపోతున్నారు. అల్లారుముద్గుగా పెంచుకోవాల్సిన చిన్నారులను రోడ్డు పాలు చేస్తున్నారు. చిట్టి చేతులను పట్టుకోని ఆడించాల్సింది పోయి యాచించే స్థితికి తీసుకొస్తున్నారు. అమ్మా ఒక రూపాయి, అయ్యా.. ఒక రెండు రూపాయలు ఇవ్వండనే పరిస్థితికి దిగజార్చుతున్నారు. బలపం, పెన్ను, పేపర్ పట్టుకోవాల్సిన వయసులో రోడ్ల వెంట చేయి చాసి అడుకుంటున్నారు. ఇలా రోడ్లుపై కనిపించిన చిన్నారుల పట్ల కొందరు మానవత్వం చాటుతున్నారు. మరి కొందరు అయ్యో పాపం అంటున్నారు. కొందరైతే పిల్ల తల్లిదండ్రులను తిట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటన కర్నూలు టౌన్‌లో జరిగింది. బిజీ ఉండు కర్నూలు నాలుగురోడ్డ కూడలిలో చిన్నారులు బిచ్చమెత్తుతూ కనిపించారు. దీంతో కొందరు డబ్బులు దానం చేశారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. దాంతో రంగంలోకి అధికారులు.. కర్నూలు ప్రధాన కూడళ్లలో తిరిగి చిన్నారులను గుర్తించారు. చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలను చదివిచాలని సూచించారు. కొందరు చిన్నారులను చిల్డ్రన్ కేర్‌కు తరలించారు. పనులు చేయకుండా పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.