Tragic incident:పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమూడి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-11-21 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమూడి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్నేహితులతో కలిసి వంశీ అనే యువకుడు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై పెళ్లి కుమారునికి గిఫ్ట్ అందించిన వెంటనే వంశీ అనే యువకుడు కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో కింద పడిపోతుండగా పక్కనే ఉన్న స్నేహితులు అతడిని పట్టుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వివాహ వేడుకలో తమతో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితుడు ఆకస్మికంగా మృతి చెందడం పై వంశీ స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు వంశీ బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. అయితే ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.


Similar News