RGV : ఆర్జీవీపై మరో కేసు నమోదు

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV)పై మరో కేసు నమోదయింది.

Update: 2024-11-21 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV)పై మరో కేసు నమోదయింది. అనకాపల్లి(Anakapalli) జిల్లా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ల ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఈ కేసు నమోదయింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ రావికమతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు వర్మ మరో వారం రోజులు సమయం కోరినట్టు తెలుస్తోంది. కాగా ఇదివరకే ఐటీ చట్టంలోని నిబంధనలు అతిక్రమించారని ఆర్జీవీపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. నవంబర్ 20న ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈకేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..ఈ పిటిషన్ పై విచారణను వారం రోజులకు కోర్ట్ వాయిదా వేసింది. 

Tags:    

Similar News