CM Chandrababu: ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా నేనే వస్తా.. అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతి (Amaravati) పనుల ప్రారంభంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు.

Update: 2024-11-22 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati) పనుల ప్రారంభంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ (Assembly)లో మాట్లాడుతూ.. డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హైస్పీడ్‌లో రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి (Amaravati)కి ఓ రూపం తీసుకొస్తామని తెలిపారు. ఎన్జీవో (NGO), ఆలిండియా సర్వీసెస్ (All India Services) భవనాలు 9 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram Project)ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యే (MLA), ఎమ్మెల్సీ (MLC) క్వార్టర్స్‌ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

అదేవిధంగా గ్రూప్-డీ (Group-D), గ్రూప్-బీ (Group-B) గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు 9 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. టీమ్ లీడర్‌గా ముందుండి పని చేస్తానని.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు తనతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి (Amaravati) పూర్తై ఉంటే ఇప్పటికి ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు వచ్చేవని అన్నారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో విలువైన సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu) 4.0 వెర్షన్ ఇప్పుడే ప్రారంభమైందని అన్నారు. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా తానే వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఓకే పార్టీ పాలిస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. 

Tags:    

Similar News