YS Sharmila:సీఎం చంద్రబాబు అదానీని బ్లాక్‌లో పెట్టాలి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) గారిని కాంగ్రెస్ పార్టీ కీలక డిమాండ్ చేసింది. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్‌ను రద్దు చేయండి. అదానీ కంపెనీని ఏపీలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టండని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలని కోరారు. దేశం మొత్తం ఇన్ని స్కాంలు జరుగుతున్న ప్రధాని మోడీ చర్యలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు అమెరికా అదానీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మోడీ స్పందించాలి.. అదానీ పై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ప్రధాని మోడీనీ ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాలని కోరుతున్నాం అన్నారు. ఇండియా - అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి. మరి అదానీని మోడీ అమెరికాకి అప్పగిస్తారా ? మోడీ నిర్ణయం ఏంటో తేల్చాలని వైఎస్ షర్మిల తెలిపారు. మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు.