వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీం కోర్టులో షాక్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది.

Update: 2025-01-07 06:26 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ(Former YCP MP) నందిగం సురేష్(Nandigam Suresh) కు మరోసారి షాక్ తగిలింది. ఓ మహిళా హత్య కేసు(Female murder case)లో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ బెయిల్ పిటిషన్(Bail Petition) ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారించిన అనంతరం.. ఈ హత్య కేసులో ఛార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌(Bail Petition)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది(Supreme Court dismissed).

ఇదిలా ఉంటే 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తుళ్లూరు మండలం వెలగపూడి కి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ(Mariyamma) తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్‌ను దూషించింది. దీంతో మరియమ్మ ఇంటిపై దాడి చేసి అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు(Nandigam Suresh Followers) మహిళను దారుణంగా హతమార్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Similar News