Drones Banned : విశాఖలో డ్రోన్ల నిషేధం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)విశాఖ పట్నం(Visakhapatnam) పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్లపై నిషేధం(Drones Banned )విధించారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)విశాఖ పట్నం(Visakhapatnam) పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్లపై నిషేధం(Drones Banned )విధించారు. నేటీ నుంచి విశాఖలో రెండు రోజుల పాటు డ్రోన్ల ఎగరవేతపై పోలీస్ శాఖ నిషేధం ప్రకటించింది. ప్రధాని పర్యటించే మార్గాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రైవేట్ డ్రోన్ల వినియోగదారులకు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు బుధవారం విశాఖలో పర్యటిస్తారు. ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారిగా వచ్చే వాహనాలకు 26చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు.
రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే కళాశాల మైదానంలో సాయంత్రం 5:30గంటలకు మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనకు 7వేల బస్సులను సిద్ధం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని లేదా సెయిల్‌లో విలీనం చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడుపుతామని ఎనిమిదో తేదీన విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
ఈ నేపధ్యంలో ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రత చర్యలు చేపట్టారు. ప్రధాని తన పర్యటనలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి పనులు సహా దాదాపు 2లక్షల కోట్ల విలువైన పనులను ప్రారంభిస్తారు.