Gorantla : మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)జైలుకు వెళ్లడం ఖాయమని, టీడీపీ(TDP) సీనీయర్ నేత, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdhury)కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-22 08:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)జైలుకు వెళ్లడం ఖాయమని, టీడీపీ(TDP) సీనీయర్ నేత, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdhury)కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లు తినేసీ, 12ఏండ్లుగా ఈడీ, సీబీఐ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న జైలుపక్షి జగన్ నేరస్తుడు, అవినీతిపరుడు, పిరికివాడు తాలిబన్ కంటే ఘోరమని బుచ్చయ్య చౌదరి విరుచకపడ్డారు. రాష్ట్ర సంపదను అదానీకి కట్టబెట్టి, గంగవరం పోర్టు వంటివి అప్పగించి వేలకోట్ల రూపాయల జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. 7వేల మెగావాట్ల పవర్ పర్చేస్ కాంట్రాక్టును ఆదానీకి అప్పగించేందుకు జగన్ రూ.1750 కోట్ల లంచం తీసుకున్నారని అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు.

బొత్స్య కూడా గతంలో వ్యోక్స్ వ్యాగన్ కంపెనీ వస్తుందని చెప్పి 10వేల కోట్లు కొల్లగొట్టారన్నారు. అసెంబ్లీకి రాని వాళ్లకు పీఏసీ చైర్మన్ పదవి ఎందుకని ఎద్దేవా చేశారు. 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటిదాక అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గళమెత్తలేదన్నారు. సభా సాంప్రదాయలంటున్న బొత్స నీతులు వల్లిస్తున్నాడని.. గతంలో జగన్ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కి, ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని, సోషల్ మీడియాలో తిట్టించి వేధించారన్న సంగతి మరువరాదన్నారు. సంఖ్యాబలం లేనప్పుడు నామినేషన్ వేయడం ఎందుకని, పారిపోవడం ఎందుకని ప్రశ్నించారు.

Tags:    

Similar News