Tragedy: రాష్ట్రంలో మరో దారుణం.. తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-11-22 11:09 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh)లోని గుంటూరు (Guntur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టణం (Guntur City)లోని చుట్టుగుంట (Chuttugunta)లో నివాసం ఉంటున్న వంశీ శ్రీనివాస్ (Vamsi Srinivas) ఏఆర్ కానిస్టేబుల్‌ (AR Constable)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇవాళ ఎస్కార్ట్ (Escort) వాహనంలోనే తుపాకీతో పాయింట్ బ్లాంక్‌ (Point Blank)లో కాల్చుకున్నాడు. దీంతో వంశీ శ్రీనివాస్ (Vamsi Srinivas) క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంశీ శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రి (Guntur Government Hospital)కి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

Tags:    

Similar News