ఇంటిరియమ్ ప్రొటెక్షన్ ఇస్తే.. ఇండియా వస్తా: ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు విచారణలో కీలక అంశం చోటు చేసుకుంది..

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు విచారణలో కీలక అంశం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణకు విదేశాలలో ఉన్న ప్రభాకర్ రావు కేసు విచారణకు హాజరవుతారని ఆయన తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ప్రభాకర్‌రావును అరెస్టు చేయవద్దని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రభాకర్‌రావు తరపున హైకోర్టు ధర్మానాన్ని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే కేసులో ఉన్నా శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టు ఇంటిరియమ్ ప్రోటెక్షన్ ఇచ్చిదని నిరంజన్ రెడ్డి తన వాదనలలో కోర్టుకు వివరించారు. శ్రవణ్ రావుకు రక్షణ కల్పించినట్లే తనకు రక్ష కల్పిస్తే విచారణరకు తప్పకుండా హాజరవుతారని తెలిపారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు కాబడిందని ప్రస్తుంతం ఆయన ఎలా తిరిగొస్తారని పోలీసుల తరపు అడ్వకేట్ తన వాదనలలో ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో అసల కీలక దారి ప్రభాకర్ రావేనని వివరించారు. పోలీస్ దర్యాప్తునకు హజరయ్యేలా , విచారణకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో ప్రభాకర్‌రావు పిటిషన్ దాఖాలు చేశారని వివరించారు. వాదనలు పరిశీలించిన ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఎప్రిల్ 7 వ తేదిన ప్రభాకర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ, విచారణకు ఆదేశించాలని పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.