విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయండి : కేంద్రమంత్రిని కోరిన మంత్రి నారాయణ
విజయవాడ మెట్రో(Vijayawada Metro)ను అమవరావతికి అనుసంధానం చేయాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు.
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ మెట్రో(Vijayawada Metro)ను అమవరావతికి అనుసంధానం చేయాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రోపై చర్చించారు. విజయవాడ మెట్రోను అమరావతి మెట్రోకు అనుసంధానం చేయాలని, ఇందుకు సంబధించిన ప్రతిపాదనలను ఇదివరకే పంపామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేసిందని.. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏపీలోని పలు నగరాల్లో మెట్రో రైళ్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టులో ఒక కారిడార్ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్ బందరు రోడ్డులో రానుందని వెల్లడించారు. ఆయా మార్గాలలో మెట్రో లైనుకు ఎలాంటి ఆటంకం లేకుండా సుదీర్ఘ పైవంతెన ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు తెలియ జేశారు.