తిరుమలలో హిందువులే పనిచేయాలి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తిరుమల(Tirumala)లో పర్యటించారు.

Update: 2025-03-21 14:21 GMT
తిరుమలలో హిందువులే పనిచేయాలి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తిరుమల(Tirumala)లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముంతాజ్ హోటల్, దేవలోక స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ(TTD) ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వం అని అన్నారు. టీటీడీ ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వెంకటేశ్వర ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. తిరుమల ఆలయంలో హిందువులే పనిచేయాలి.. ఆలయ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. తిరుమల ఆలయంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, మనవడు, నారా లోకేష్(Nara Lokesh) కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు(Devansh's Birthday) సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి భారీ విరాళం అందజేశారు. అనంతరం భక్తులకు భోజనం వడ్డించారు. అంతకుముందు సీఎం చంద్ర‌బాబుకు ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు(BR Naidu), అర్చ‌కులు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీవారి సేవ‌లో ఆయనతో పాటు నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh), కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు.

Tags:    

Similar News