Good News:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పాఠశాల(School) విద్యార్థులకు(Students) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: పాఠశాల(School) విద్యార్థులకు(Students) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'శనివారం.. నో బ్యాగ్ డే'గా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డేగా పాటించనున్నట్లు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నో బ్యాగ్ డే(No Bag Day) అమలు చేస్తామని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారాల్లో విద్యార్థులకు క్రీడలు, క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు వివిధ పోటీలు నిర్వహణ పై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.