Tirupati: లాడ్జిలో వ్యభిచారం.. నిర్వాహకుడు, విటులు అరెస్ట్

తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ శ్రీ పద్మావతి రెసిడెన్సి లాడ్జిపై పోలీసులు దాడి చేశారు...

Update: 2023-03-22 12:03 GMT

దిశ, తిరుపతి: తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ శ్రీ పద్మావతి రెసిడెన్సి లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురు నిందితులతో పాటు లాడ్జి యాజమాన్యానికి చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధిత యువతులను వారి బంధువులకు అప్పగించారు. లాడ్జి యజమాని పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News