Tirupati: తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

Tirupati Devasthanams Income: తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? శ్రీవారి ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా. 11,225కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వెండి ఆభరణాలు 9,071.85కిలోలు, 7600ఎకరాలకు పైగా భూమి. దేశంలోని 75 ప్రదేశాల్లో ఆలయ ట్రస్టుకు సంబంధించి 7,600ఎకరాల భూమి ఉంది.

Update: 2025-01-10 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్రీవారి వైభవాన్ని ఎన్నిసార్లు పొడిగినా తక్కువే. వందల ఏళ్లుగా తరగని వైభవం తిరుమల శ్రీవారి సొంతం. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఏడు కొండల్లో కొలువైన శ్రీవారిని చూసేందుకు...7 సముద్రాల అవతల ఉన్న విదేశీయులు కూడా భక్తితో తిరుమలకు తరలి వస్తుంటారు. ప్రపంచంలో మరే దైవానికి దక్కని విశిష్ట సేవలు తిరుమల శ్రీవారికి దక్కుతున్నాయి. అందుకే ఆయన దర్శనం చేసుకున్న ప్రతిఒక్కరూ మరోసారి రాకుండా ఉండలేకపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వేంకటేశ్వరుడి మహిమలు ఎన్నో ఉన్నాయి.

భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయం వేంకటేశ్వరుడిదే. ఆలయ ట్రస్టుకు రూ. 3,00,000కోట్ల ఆస్తులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) మత పరమైన సంస్థ కాదు. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉంటుంది. ఈ ఆలయానికి ప్రతి ఏడాది 1400కోట్లు రూపాయల విరాళాలు అందుతున్నాయి. ప్రతిరోజూ లక్షమంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. అలాగే ఈ ఆలయం గురించి..దాని సంపద గురించి వివరంగా తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం(Tirupati Devasthanams ) 11, 225కిలోల బంగారం, 7600 ఎకరాలకు పైగా భూమి, బ్యాంకు డిపాజిట్లు(Bank deposits) ఉన్నాయి. కాగా వెండి ఆభరణాలు 9,071.85 కిలోలు. దేశంలోని 75 ప్రదేశాల్లో ఆలయ ట్రస్టుకు 7,600 ఎకరాల భూమి ఉంది. ఇదే కాకుండా ట్రస్టుకు 6,000 ఎకరాల అటవీ భూమి ఉంది. మరో విశేషమేంటీ అంటే దేశంలోని అనేక పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్(Market cap) లో ఉన్నంత డబ్బు శ్రీవారి ఆలయానికి ఉంది.

ఇక ఆలయ ట్రస్టు(Temple Trust) అందించిన సమాచారం ప్రకారం.. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరు భక్తులు సమర్పించిన డబ్బు, నగలు, వజ్రాలు, ముత్యాలు. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 16 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒక రిపోర్టు ప్రకారం టీటీడీ ట్రస్టు బ్యాంకు(TTD Trust Bank)ల్లో 15,000కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. 2022ఏడాదిలో ట్రస్టు ఆలయం(Trust Temple)లో జమ చేసిన ఆస్తులను వెల్లడిస్తూ ఒక పత్రాన్ని విడుదల చేసింది. మరో మీడియా కథనం ప్రకారం తిరుపతి దేవస్థానానికి రోజుకు 2కోట్లు రూపాయలకు పైగా విరాళాలు (Donations) అందుతున్నాయి. కాగా పండగ రోజుల్లో 3 నుంచి 4 కోట్లకు చేరుకుంటుంది.

టీటీడీ(TTD) ఇతర ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతుంది. లడ్డూ (Laddu) ల విక్రయం ద్వారా ఏటా 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా.. వెంట్రుకలను విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.

Tags:    

Similar News