Brihadeeswara Temple: వెయ్యేళ్ల కిందట ఈ ఆలయ నిర్మాణం.. సైంటిస్టులకు పెను సవాలు!
ఈ ఆలయ కట్టడం కోసం ఎక్కడి నుంచీ గ్రానైట్ తెచ్చారు? ఎలా తీసుకొచ్చారన్నది ఆశ్చర్యకరం
దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో మనకీ ఎన్నో రహస్యాలు ( Unknown Facts ) ఉన్నాయి. పరిశోధకలు ఎప్పటికప్పుడు వాటిని చేధిస్తూనే ఉన్నారు అయినా అంతుబట్టడం లేదు. అలాగే, మన దేశంలో కొన్ని వింత దేవాలయాలున్న విషయం చాలా మందికీ తెలియదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే! ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు? ప్రశ్నలు? అసలు ఆ ఆలయం ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఇది సైంటిస్టులకు పెను సవాలుగా మారింది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
తమిళనాడు.. తంజావూర్‌లోని ( Thanjavur ) బృహదీశ్వరాలయానికి ( Brihadeeswara Temple )ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గుడిలో ఎక్కువ భాగం.. గ్రానైట్‌తో నిర్మించారు. అయితే, ఇప్పుడు ఇదే సైంటిస్టులకు పెద్ద సవాలు విసురుతోంది. ఎందుకంటే.. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఎక్కడా కూడా గ్రానైట్ ఆనవాళ్లూ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే.. 60 కిలోమీటర్ల వరకూ.. గ్రానైట్ నిక్షేపాలు లేవు. వెయ్యేళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయ కట్టడం కోసం ఎక్కడి నుంచీ గ్రానైట్ తెచ్చారు? ఎలా తీసుకొచ్చారన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా, ఇక్కడి గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారు చేశారు. ఎలాంటి క్రేన్లూ వాడకుండా.. ఆ భారీ శిలను, అంత పైకి ఎలా చేర్చగలిగారన్నది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నా.. ఎలాంటి ఫలితం లేదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.