Rat Temple : ఎలుకలకు పూజ చేస్తున్న భక్తులు .. పొరపాటున హాని చేస్తే బంగారు విగ్రహాన్ని కానుకగా ఇవ్వాలి..!
ఈ ప్రపంచంలో మనకీ ఎన్నో రహస్యాలు ( Unknown Facts ) ఉన్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో మనకీ ఎన్నో రహస్యాలు ( Unknown Facts ) ఉన్నాయి. పరిశోధకలు ఎప్పటికప్పుడు వాటిని చేధిస్తూనే ఉన్నారు అయినా అంతుబట్టడం లేదు. అలాగే, మన దేశంలో కొన్ని వింత దేవాలయాలున్న విషయం చాలా మందికీ తెలియదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే! ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయంలో ఎలుకలను దేవుళ్ళుగా పూజిస్తున్నారు. దాని వెనుకున్న రహస్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కార్నీ మాత టెంపుల్ ( Shree Karni Mata Temple ) ఈ ఆలయంలో 20 వేలకు పైగా ఎలుకలున్నాయి. రాజస్థాన్ లోని బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద ఉంది. ఇక్కడ వీటిని 'కబ్బాస్' అని పిలుస్తుంటారు. ఇక్కడ భక్తులు ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను.. ఎలుకల్లో చూసుకుంటారు. అందుకే ఇక్కడ ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి.
అంతే కాకుండా, భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ వెళ్లే టూరిస్టులు.. తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఎందుకంటే.. ఎలుకలకు పూజ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. చాలా మంది వాటిని వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.