దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై టీటీడీ(Tirumala Tirupati Devasthanam) అత్యవసర సమావేశం (TTD Emergency meeting) ఏర్పాటు చేయనుంది.
తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) అధ్యక్షతన ఈ చర్చ జరుగనుంది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారం పై సమావేశంలో తీర్మానం.. బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు అందజేత పై చర్చించనున్నారు. ఈ క్రమంలో ముగ్గురు టీటీడీ బోర్డు(TTD Board) సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.