Tirupati: మద్యం కుంభకోణంలో సీఎం జగన్ రికార్డ్ బ్రేక్
2019 జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యాన్ని ప్రధానమైన ఆదాయంగా మార్చుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ అన్నారు...
దిశ, తిరుపతి: 2019 జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యాన్ని ప్రధానమైన ఆదాయంగా మార్చుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ అన్నారు. నాసిరకమైన మద్యం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతు గత ప్రభుత్వంలో మద్యం తాగి మరణించిన సంఖ్యల కంటే ఈ ప్రభుత్వంలో 25% పెరిగిందన్నారు.
ప్రభుత్వ మద్యం షాపులో డిజిటల్ పేమెంట్ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. మద్యం తయారీ సంస్థ ఎవరిదనిప్రశ్నిస్తే పాలకులు సమాధానం చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తాము చేసిన సర్వేలో ఏపీ బేవరేజెస్ సంస్థ నాసిరకం మద్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఏ2 నిందితుడు ట్విట్టర్ రెడ్డిపై 420 కేసులు ఎన్నో ఉన్నాయని ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావలసిన జగన్ ఆ రోజే ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు. 3 వేల కంటే ఎక్కువ వాయిదాలకు సీఎం జగన్ డుమ్మా కొట్టారని విమర్శించారు.
విదేశాల్లో నల్లదాన్ని రప్పించి జగతి పబ్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో దానిని తెల్ల ధనంగా మార్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ ఆరోపించారు. ఎ1, ఎ2 నిందితులను కటకటాల వెనక్కు పంపే వరకు బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో అతి పురాతన కట్టడాలను కూల్చివేసే కోణంలో పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పురవావస్తు శాఖ విభాగం అనుమతితో 75 సంవత్సరాలు పైబడిన చారిత్రాత్మక కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని గుర్తు చేశారు. కానీ వీటిని అన్నింటిని పక్కనపెట్టి కొండపై వెయ్యికాల మండపాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. అలాగే ఫార్వేటి మండపాన్ని ఆల్టరేషన్ చేశారని చెప్పారు. ఇలాంటి ఘోర తప్పిదాలను బీజేపీ కచ్చింతంగా ప్రశ్నిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ హెచ్చరించారు.