సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌: మరికాసేపట్లో విచారణ

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

Update: 2023-11-28 05:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత వారం సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సీఐడీ కోరింది. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్‌ 64గా లిస్ట్‌ అయ్యింది. ఇకపోతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు అనారోగ్యం పాలవ్వడంతో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం చంద్రబాబుక రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులోతమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని సీఐడీ పిటిషన్‌లో ఆరోపించింది. ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.     

Tags:    

Similar News