దాచేపల్లిలో డయేరియా కలకలం.. కలెక్టర్‌కు సీఎం కీలక ఆదేశాలు
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో డయేరియా కలకలం రేపింది...
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) దాచేపల్లి(Dachepalli)లోని అంజనాపురం కాలనీలో డయేరియా(Diarrhea) కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడారు. డయేరియాతో ఇద్దరు మృతి చెందారన్న సమాచారంపై నీరు కలుషితం(Water Polluted) కావడం వల్ల చనిపోయారా లేక వేరే కారణాలున్నాయా అని తీరా తీశారు. ప్రస్తుతం దాచేపల్లిలోని పరిస్థితులను చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. స్థానిక బోర్ల వాటర్‌ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. బోర్లను మూసి వేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆదేశించారు. దాచేపల్లిలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, సాధారణ పరిస్థితి వచ్చేవరకు నిత్యం పర్యవేక్షించాలని, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశించారు.