BREAKING: యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు అరెస్ట్

వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మాధురి (33)ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-06-18 17:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మాధురి (33)ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవల చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో వృత్తిరీత్యా పెయింటర్ అయిన సూర్య (24) ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే రోడ్డులో వస్తున్న మాధురి కారు అతివేగంతో సూర్యపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కారు నడిపింది వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురు మాధురిగా నిర్ధారించారు. దీంతో ఆమెను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News