ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి...

Update: 2024-06-26 17:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను లక్ష మంది విద్యార్థులు రాశారు. అయితే వీరిలో 67,115 ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకూ ఈ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఫలితాలను విడుదల చేశారు. పాసైన విద్యార్థులకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ http://bse.ap.gov.inలో చూసుకోవచ్చని లోకేశ్ సూచించారు.

Similar News