DSC Video: అప్పుడు వీడియో ఇప్పుడు ఎలా రా బాబు..! వైసీపీపై నెటిజన్స్ ఫైర్!

ఎలుక తోకను ఏడాది ఉతికినా నలుపు నలుపే అన్నట్టుగా వైసీపీకీ అధికారం ఇచ్చినా..? గద్దె దింపి ఇంటికి పంపినా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు.

Update: 2024-06-29 12:48 GMT

దిశ వెబ్ డెస్క్: ఎలుక తోకను ఏడాది ఉతికినా నలుపు నలుపే అన్నట్టుగా వైసీపీకీ అధికారం ఇచ్చినా..? గద్దె దింపి ఇంటికి పంపినా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటని అటు రాజకీయ నేతలతోపాటు ఇటు ప్రజలు సైతం నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పడం అంటుంచితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా గడవలేదు. అప్పుడే కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణల రూపంలో అసత్యాలను ప్రచారం చేస్తోంది.

నిరుద్యోగులు భారీ ర్యాలీ.. కట్ చేస్తే వెలుగు చూసిన అసలు విషయం..

తాజాగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. మెగా డీఎస్సీ పేరుతో తమని దగా చేశాడంటూ అనంతపురం జిల్లాలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారిని పేర్కొంది. అలానే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డుగోలుగా అప్పులు చేసేస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం బీహార్‌లో గట్టిగా జేడీయూ డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం వద్ద ఆ ఊసే ఎత్తని టీడీపీ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

కాగా ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ వైసీపీపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వీడియోలను, అవాస్తవాలను ప్రచారం చేయడం కారణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైందని మండిపడుతున్నారు. 4 నెలల క్రింతం వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసి కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేపే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే డీఎస్సీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుడదల కానున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు డీఎస్సీ పేరుతో తమని దగా డీఎస్సీ అంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీకి నెటిజన్స్ నుండి ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నోకొన్ని పోస్టులకైనా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

కాని గత ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..? ఎంతమందికి ఉపాధి కల్పించారు..? అంటూ వైసీపీని నిలదీస్తున్నారు. అసలు ఏమీ ఇవ్వని మీకంటే.. అంతోఇంతో ఇస్తున్న కూటమి ప్రభుత్వం మేలేకదా అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Similar News