ఇళ్లు లేని వారికి గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు

Update: 2024-07-01 15:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో మంత్రి పొంగులేటి సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ఆలస్యమైందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుకు కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. 

Similar News