BREAKING: బాబుకు ఇండియా కూటమి బంపర్ ఆఫర్.. ఆ పదవులు ఇస్తామని రాయబారం

కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది.

Update: 2024-06-05 17:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రాలోని చంద్రబాబు మద్దతు ఎన్డీయేకు అనివార్యమైంది. ఈ క్రమంలోని ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తాయిలాలను చూపుతోంది. కాగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఐదు కేబినెట్‌ మంత్రి మంత్రులు, స్పీకర్‌ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, చంద్రబాబుతో సయోధ్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది. అదేవిధంగా నితీష్‌ కుమార్‌తో సోనియా గాంధీ కాంటాక్ట్ అయినట్లుగా సమాచారం.


Similar News