లోకేశ్‌కు బిగ్ రిలీఫ్: ఆ కేసులో నిందితుడు కాదట

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భారీ ఊరట లభించింది.

Update: 2023-10-12 08:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో లోకేశ్‌ను నిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ ఏపీ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ఒకవేళ చేరిస్తే 41 ఏ నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అనంతరం విచారణకు పిలుస్తామని సీఐడీ కోర్టు తెలిపింది. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గురువారం హైకోర్టులో స్కిల్ స్కాం కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఆయన కుటుంబ సభ్యులు లబ్ది పొందినట్టుగా ఆరోపణలు చేసిందని లోకేశ్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే సీఐడీ తరఫున న్యాయవాదులు సైతం వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చేర్చలేదని... అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని వెల్లడించారు. ఈ కేసులో లోకేశ్ పేరు చేర్చితే.. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టుగా వెల్లడించారు. ఇరు వాదనల విన్న హైకోర్టు లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

Tags:    

Similar News