Big Relief:ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడ

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-10 02:01 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంటపొలాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక విజయవాడ(Vijayawada) జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల(Floods) వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకోవాడానికి సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా అటు వరదలు(Floods), ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరై నగరవాసులు బయటకు వస్తున్నారు. నిన్న వర్షాలు కురవకపోవడంతో సహాయక చర్యలు(Assistive measures) వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ(Barrage) గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.


Similar News