తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. ఈ 11 నుంచి మంచి ముహూర్తాలు

ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది....

Update: 2024-02-09 03:53 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండగా వివాహ ముహుర్తాల 13వ తేదీ నుంచి ఉన్నాయి. ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తోపాటు మార్చి 2,3 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో తెలుగు రాష్ట్రాలల్లో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఫాల్గుణం మాసం మార్చిలో 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్‌ 3, 4 తేదీలు, చైత్ర మాసం ఏప్రిల్‌లో 9, 18, 19, 20, 21, 22, 24, 26 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 28 నుంచి తిరిగి మూఢం ప్రారంభం కానుంది.


Similar News