ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. GOIR వెబ్ సైట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను GOIR వెబ్ సైట్‌లో పొందుపర్చనుంది. ఈ జీవో ఐఆర్ 2021 వరకూ కొనసాగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ విధానాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ జీవో ఐఆర్‌ను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి జీవో ఐఆర్‌ను పునరుద్ధరించనుంది. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవోను GOIR వెబ్ సైట్‌లో ప్రజలు చూసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.