Ap Politics:వార్‌ వన్‌సైడ్‌..అందుకే ఆ పార్టీ వైపు చూపు

టీడీపీ, జనసేన, బీజేపి కూటమి విజయం వన్‌సైడ్‌గా మారడంతో ఎంతోమంది ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని, వారికి భవిష్యత్తులో పార్టీ పూర్తిస్థాయి న్యాయం చేస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి భరోసా ఇచ్చారు.

Update: 2024-04-05 15:25 GMT

దిశ,ఏలూరు:టీడీపీ, జనసేన, బీజేపి కూటమి విజయం వన్‌సైడ్‌గా మారడంతో ఎంతోమంది ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని, వారికి భవిష్యత్తులో పార్టీ పూర్తిస్థాయి న్యాయం చేస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి భరోసా ఇచ్చారు. నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇడా మాజీ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరీ, మధ్యాహ్నపు బలరాం దంపతులు, ఎఎంసీ వైస్‌ చైర్మన్‌ కంచన రామకృష్ణ, మాజీ కార్పొరేటర్లు అద్దేపల్లి శ్రీను, జిజ్జువరపు ప్రతాప్‌, పిళ్ళా హరినారాయణ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు పవర్‌ పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం దక్కుతుందని, మిగిలిన పార్టీల్లో ఇది సాధ్యం కాదన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకోని ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని, వారందరికీ సమాన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బలరాం కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందన్నారు. బలరాం మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లలో ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఇడా మాజీ చైర్‌పర్సన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు తనకు వైసీపీ టిక్కెట్‌ ఇస్తానని పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి తదితరులు హామీ ఇచ్చారని, అయితే నమ్మించి మోసం చేశారని విమర్శించారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే సమర్ధత టీడీపీ అధినేత చంద్రబాబుకే ఉందన్న నమ్మకంతో టీడీపీలో చేరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More..

టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎంపీ RRR 

Tags:    

Similar News